logo

హృదయాలను తెరచి.. సేవలను స్మరించి

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావు సంస్మరణ సభను సూర్యాపేట జిల్లాకేంద్రం జమ్మిగడ్డలోని ‘ఈనాడు’ యూనిట్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించారు.

Published : 21 Jun 2024 06:18 IST

సూర్యాపేట ఈనాడు యూనిట్‌ కార్యాలయంలో రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఉద్యోగులు

సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావు సంస్మరణ సభను సూర్యాపేట జిల్లాకేంద్రం జమ్మిగడ్డలోని ‘ఈనాడు’ యూనిట్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ‘ఈనాడు-ఈటీవీ’లో పనిచేసే అన్ని విభాగాల సిబ్బంది హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు, పుష్పాలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ‘రామోజీరావు అమర్‌ రహే’ అంటూ నినదిస్తూ.. ఆయన ఆశయాలు కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పలువురు సీనియర్‌ జర్నలిస్టులు, సిబ్బంది రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సూర్యాపేట యూనిట్‌ బాధ్యుడు రమాకాంత్‌ మాట్లాడుతూ సంస్థలో పనిచేసే సిబ్బంది ఎల్లవేళలా ఆరోగ్యంతోపాటు ఆనందంగా ఉండాలని రామోజీరావు కోరుకునే వారని, ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. క్రమశిక్షణ, విశ్వసనీయతకు రామోజీరావు మారుపేరుగా నిలిచారని పేర్కొన్నారు. ఎంతో మంది ఉపాధికి బాటలు వేసిన మహనీయుడని కొనియాడారు.

మౌనం పాటిస్తున్న సిబ్బంది 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని