logo

యోగా సాధనతో ఆహ్లాదకరమైన జీవనం

యోగా సాధనతో ఒత్తిడిని జయించి నిత్యం ఆహ్లాదరకమైన జీవనం సాగించవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు అన్నారు.

Updated : 22 Jun 2024 06:19 IST

జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు

శీర్షాసనంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు, చిత్రంలో జడ్జిలు మాధవిలత, నాగేశ్వరరావు, కవిత, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు

భువనగిరి గంజ్, న్యూస్‌టుడే: యోగా సాధనతో ఒత్తిడిని జయించి నిత్యం ఆహ్లాదరకమైన జీవనం సాగించవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం ఉదయం యోగా కార్యక్రమం నిర్వహించారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ యోగా శిక్షకులు ఉప్పల రవి, చింత అనిల్‌ యోగాసనాలను సాధన చేయించారు. న్యాయమూర్తి జయరాజు శీర్షాసనం వేసి అందరిని ఉత్తేజపర్చారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ.. నేడు యువత చిన్న సమస్యలకు ఒత్తిడికి గురవుతున్నారని యోగా, ధాన్యంతో మానసిక ప్రశాంతత పొందుతారని అన్నారు. రామచంద్రమిషన్‌ హార్ట్‌ఫుల్‌ మెడిటేషన్‌ బోధకులు చేపూరి నరసింహచారి, నమోజు నరేష్,  నేచర్‌క్యూర్‌ వైద్యశాల డాక్టర్‌ కార్తిక్‌రెడ్డి ధాన్యం, ప్రకృతి వైద్యం గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రధాన సీనియర్‌ సివిల్‌ జడ్జి వి.మాధవిలత, ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జి డి.నాగేశ్వరరావు, అదనపు జూనియర్‌ సివిల్‌జడ్జి కవిత, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బబ్బూరి హరినాథ్‌గౌడ్, కార్యదర్శి కె.కృష్ణ, న్యాయవాదులు అంజయ్య, జైపాల్, శంకర్, కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

చౌటుప్పల్‌:  అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చౌటుప్పల్‌ పట్టణంలో వాడవాడలో శుక్రవారం నిర్వహించారు. లింగోజిగూడెంలోని దివిస్‌ పరిశ్రమలో వందల మంది ఉద్యోగులు సామూహికంగా యోగాసనాలు ప్రదర్శించారు. నిత్యం యోగా సాధన చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో యోగా సాధన చేస్తున్న డైరెక్టర్‌ వికాస్‌ భాటియా, డీన్‌ ప్రొఫెసర్‌ రాహుల్‌ నారంగ్‌

ఎయిమ్స్‌లో..

బీబీనగర్‌: బీబీనగర్‌ ఎయిమ్స్‌లో స్వయం, సమాజం కోసం యోగా థీమ్‌తో యోగా దినోత్సవం నిర్వహించారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వికాస్‌ భాటియా, డీన్‌ ప్రొఫెసర్‌ రాహుల్‌ నారంగ్, డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ బిపిన్‌ వర్గీస్‌ పాల్గొన్నారు. 70 మంది విద్యార్థులు యోగా చేశారు. యోగా ప్రాముఖ్యతను రాహుల్‌ నారంగ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ఎయిమ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ బిపిస్‌ వర్గీస్, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహేశ్వర్, లక్కిరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని