logo

5.3 లక్షల మంది రైతులకు లబ్ధి

ఏకకాలంలోనే 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రకటించడంతో మూడు జిల్లాల అధికార యంత్రాంగం అర్హుల జాబితా తయారు చేసేందుకు సన్నద్ధమవుతోంది.

Published : 22 Jun 2024 02:36 IST

ఏకకాలంలో రుణమాఫీతో అన్నదాతల హర్షం

ఈనాడు, నల్గొండ : ఏకకాలంలోనే 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రకటించడంతో మూడు జిల్లాల అధికార యంత్రాంగం అర్హుల జాబితా తయారు చేసేందుకు సన్నద్ధమవుతోంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి సుమారు 5.3 లక్షల మంది రైతులు రూ.2 లక్షల రుణమాఫీకి అర్హులుగా ఉన్నారని.. ఇందుకు రూ.7 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేశారు. తాజాగా ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో మరింత లోతుగా అన్నదాతల రుణ వివరాల సేకరణకు చర్యలు తీసుకోనుంది. ఒకట్రెండు రోజుల్లో వ్యవసాయ శాఖ అధికారులతో పాటూ బ్యాంకర్లతో జిల్లా పాలనాధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. అప్పటిలోగా ఎంత మంది రైతులు రూ.2 లక్షల్లోపు రుణాలు తీసుకున్నారు, ఏ ఏ బ్యాంకుల్లో ఎంత మేర బకాయిలున్నాయనే సమగ్ర వివరాలతో రావాలని మౌఖికంగా బ్యాంకర్లను ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఏకకాలంలోనే రైతుల రుణమాఫీ పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో ఉన్న బకాయిలు మాఫీ అయితే ఈ సీజన్‌లో కొత్తగా రుణాలు తీసుకునేందుకు వారికి అవకాశం ఉంటుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని