logo

Road accident: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

లారీ, ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో  వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా  భూపాల్ పట్నం జాతీయ రహదారిపై పగిడిపల్లి- బీబీనగర్ మధ్య జరిగింది.

Published : 17 Jun 2024 11:23 IST

భువనగిరి : లారీ, ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో  వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా  భూపాల్ పట్నం జాతీయ రహదారిపై పగిడిపల్లి- బీబీనగర్ మధ్య జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని