logo

మహిళలకు అండగా ప్రభుత్వం: కాకాణి

మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 26 Mar 2023 03:03 IST

మహిళలకు చెక్కు ఇస్తున్న మంత్రి కాకాణి

గోవర్ధన్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు

నెల్లూరు (కలెక్టరేట్‌) : మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆసరా మూడో విడత నిధుల పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో స్వయం సహాయక సంఘాల మహిళల ఇబ్బందులను చూసి, ప్రభుత్వం వచ్చిన తక్షణమే రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఆమలుచేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా వారి  ఖాతాల్లో నిధులు నేరుగా జమ చేస్తున్నారన్నారు. జిల్లాకు తొలి విడతగా 31,569 సంఘాల్లోని 3,09,877 మందికి రూ.250.23 కోట్లు, రెండో విడతలో 34,323 సంఘాల్లోని 3,28,646 మందికి రూ.285.18 కోట్లు, మూడో విడతగా 34,443 సంఘాల్లోని 3,29,815 మందికి రూ.290.17 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావాలన్న సంకల్పంతో ఆసరా కార్యక్రమం ద్వారా తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. ముందుగా చిరుధాన్యాల మహోత్సవ్‌ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలలను సందర్శించి పిండి వంటలను రుచి చేశారు. కార్యక్రమంలో జేసీ రోణంకి కూర్మనాథ్‌, జిల్లా గ్రామీణాభివృధ్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ సాంబశివారెడ్డి, బొందిలి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కృష్ణకిశోర్‌, కార్పొరేటర్‌ మొయిళ్ల గౌరి, ఐటీడీఏ పీవో మందా రాణి, మెప్మా, ఏపీఎంఐపీ పీడీలు రవీంద్ర, శ్రీనివాసులు, డీటీసీ చందర్‌, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ వెంకటయ్య, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని