logo

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని గుంటూరు రేంజి డీఐజీ పాలరాజు పోలీసు అధికారులను సూచించారు. ఆదివారం స్థానిక ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌హాలులో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు.

Published : 29 May 2023 05:29 IST

మాట్లాడుతున్న గుంటూరు రేంజి డీఐజీ పాలరాజు, చిత్రంలో ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని గుంటూరు రేంజి డీఐజీ పాలరాజు పోలీసు అధికారులను సూచించారు. ఆదివారం స్థానిక ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌హాలులో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. డీఐజీ మాట్లాడుతూ పెండింగ్‌ కేసులు హేతుబద్ధంగా విశ్లేషించి తగ్గించాలన్నారు. పోలీసుస్టేషన్లను ఆశ్రయించే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, సున్నితమైన భాషతో మాట్లాడాలని.. మేమున్నామనే నమ్మకం కలిగించాలన్నారు. మహిళలు, బాలికలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే ప్రతిస్పందించాలని ఆదేశించారు. ఎస్పీ డాక్టర్‌ కె.తిరుమలేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు చేరువ కావడానికి జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి సత్ఫలితాలు సాధిస్తామని చెప్పారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ప్రతి పోలీసు అధికారి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పెండింగ్‌ కేసుల ఛేదన, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు, సలహాలు చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో ట్రిపుల్‌ రైడింగ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనిఖీలు చేయాలన్నారు. గత నెలలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు డీఐజీ చేతులు మీదుగా అందించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీలు హిమవతి, శ్రీనివాసరావు, డీఎస్పీలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని