logo

తెలుగుపై మక్కువ... బోధనలో వైవిధ్యం

తెలుగు భాష గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే... ప్రపంచంలోనే ఎక్కువ అక్షరమాల కలిగిన భాషకు 15వ శతాబ్దంలో ఇటలీ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగును ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌ గా అభివర్ణించాడు.

Updated : 26 Jun 2024 02:50 IST

పురస్కారం అందుకుంటున్న తాటిపర్తి

న్యూస్‌టుడే, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం : తెలుగు భాష గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే... ప్రపంచంలోనే ఎక్కువ అక్షరమాల కలిగిన భాషకు 15వ శతాబ్దంలో ఇటలీ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగును ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌ గా అభివర్ణించాడు. అమ్మభాష రాకపోతే మరే భాషను నేర్చుకోలేరనేది అక్షర సత్యం. ఆంగ్ల పోకడలు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో కొడవలూరు మండలం వెంకన్నపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాటిపర్తి వెంకటేశ్వర్లు తెలుగుభాష కోసం కృషి చేస్తున్నారు.

అందుకున్న పురస్కారాలు

  • ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో 2024 ఏప్రిల్‌ 5న జరిగిన శతాధిక జాతీయ ఉగాది కవి సమ్మేళనంలో ఆ సంస్థ సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
  • 2024 మార్చి 9, 10వ తేదీల్లో కాకినాడలో జరిగిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ప్రతిభ చూపినందుకు సినీ గేయ రచయిత భువనచంద్ర చేతుల మీదుగా ఉత్తమ సాహితీ పురస్కారం దక్కింది.
  • 2024 జనవరి 5, 6, 7వ తేదీల్లో ఆంధ్ర సారస్వత్‌ పరిషత్తు ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగిన 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో పతకం అందుకున్నారు.
  • 2023 ఏప్రిల్‌ 9, 10వ తేదీల్లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో  సేవలకు జ్ఞాపిక, ప్రశంసాపత్రం లభించింది. వివిధ ప్రాంతాల్లో పలు సాహితీ సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు.

పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు..

గుణాత్మక విద్య పెంపుదల, భాషాభివృద్ధి కోసం ప్రాథమిక స్థాయి నుంచే చిన్నారులకు తెలుగు కవులు, సాహితీవేత్తలు, ఇతిహాసాలు, పండుగలు, సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తున్నారు. తెలుగుభాషా, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాలు, పద్యపఠన పోటీలు నిర్వహిస్తున్నారు.

తెలుగు భాషా రిసోర్సుపర్సన్‌గా వ్యవహరిస్తూ బోధనలో మెలకువలు అందిస్తున్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇచ్చి.. పలువురికి అవగాహన కల్పిస్తున్నారు.

మాతృభాష కాపాడుకోవడం మన బాధ్యత

తెలుగుభాషను కాపాడుకోవడం మన బాధ్యత. పాఠశాల స్థాయి చిన్నారులకు మక్కువ పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. తల్లి భాష రాకపోతే మరొక భాష నేర్చుకోవడం కష్టమవుతుంది. మాతృభాష బాగా నేర్చుకుంటే మిగతా భాషలు సులువుగా నేర్చుకుంటారు.

తాటిపర్తి వెంకటేశ్వర్లు, తెలుగుభాష రిసోర్స్‌పర్సన్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని