logo

ఎన్‌ఎంఎంఎస్‌ ఫలితాలు విడుదల

జాతీయ స్థాయిలో ఉపకార వేతనాలు పొందేందుకు నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష ఫలితాలను మంగళవారం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

Updated : 26 Jun 2024 02:52 IST

జిల్లావ్యాప్తంగా 200 మంది ఎంపిక

విద్యార్థినులను అభినందిస్తున్న ప్రధానోపాధ్యాయులు విజయప్రకాశ్‌

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: జాతీయ స్థాయిలో ఉపకార వేతనాలు పొందేందుకు నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష ఫలితాలను మంగళవారం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా రెండు వేల మందికి పైగా పరీక్ష రాయగా 200 మంది ఎంపికయ్యారని డీఈవో రామారావు తెలిపారు. జనరల్‌లో 66 మంది, ఎస్సీ 30 మంది, ఎస్టీ 8, బీసీఏ 11, బీసీబీ 12 బీసీడీ 11, బీసీఈ ఆరుగురు అర్హత సాధించారని పేర్కొన్నారు. వీరికి ఇంటర్‌ వరకు ఉపకార వేతనం అందనుందన్నారు. ఎంపికైన కేఎన్‌ఆర్‌ పాఠశాల విద్యార్థులను మంగళవారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయప్రకాష్‌ అభినందించారు. పాఠశాలలో పలువురు విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని