logo

ప్రభుత్వ స్థలాల్లో వైకాపా కార్యాలయాలా?

పేదల భూములను ఆక్రమించి.. రాజ ప్రాసాదాలను తలపించేలా కట్టిన వైకాపా కార్యాలయాలను ప్రభుత్వానికి అప్పగించాలని జనసేన నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం వెంకటేశ్వరపురం కాలనీలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనం వద్ద జనసేన నాయకులు ధర్నా చేశారు.

Updated : 26 Jun 2024 06:56 IST

వైకాపా కార్యాలయం వద్ద జనసేన నాయకుల ధర్నా

నెల్లూరు(వీఆర్సీ సెంటరు) : పేదల భూములను ఆక్రమించి.. రాజ ప్రాసాదాలను తలపించేలా కట్టిన వైకాపా కార్యాలయాలను ప్రభుత్వానికి అప్పగించాలని జనసేన నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం వెంకటేశ్వరపురం కాలనీలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనం వద్ద జనసేన నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాల్లో వైకాపా కార్యాలయాలు నిర్మించడం దారుణమన్నారు.  ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వారే.. వాటిని అన్యాక్రాంతం చేయడం బాధకరమన్నారు. వైకాపా అయిదేళ్ల పాలనలో అనేక అరాచకాలు చోటు చేసుకున్నాయని ధ్వజమెత్తారు. వాటన్నింటికీ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు  గునుకుల కిషోర్, నూనె మల్లికార్జున యాదవ్, వీర మహిళలు నాగరత్నం యాదవ్, వై.రవి, కె.కృష్ణా రెడ్డి, హరిరెడ్డి పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని