logo

జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక కార్యాచర

జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.

Updated : 26 Jun 2024 06:54 IST

మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి మొక్క అందిస్తున్న జేసీ సేతు మాధవన్‌  

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నెల్లూరు సంతపేటలోని క్యాంప్‌ కార్యాలయంలో జేసీ సేతు మాధవన్, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమావేశమై ప్రజా సమస్యల పరిష్కార దిశగా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. అధికారులందరూ జిల్లాను అభివృద్ధి పథ]ంలో నడిపేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, సాగు, తాగునీరు, రహదారుల నిర్మాణం తదితర పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రిని జేసీతో పాటు ర.భ ఎస్‌ఈ గంగాధర్, ఈఈ మురళీకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, సోమశిల ప్రాజెక్టు, జిల్లా పంచాయతీ అధికారి, పలు విభాగాల అధికారులు, ఉన్నతాధికారులు కలిసారు. మంత్రిని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ వీసీ సుందరవల్లి, రిజిస్ట్రార్‌ రామచంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు