logo

ఆక్రమణల చెరలో మందాటి చెరువు

కావలి పట్టణ పరిధిలోని చెరువులు, నీటి గుంతలు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నా.. అధికారులు స్పందించడం లేదు. ఫలితంగా ప్రజోపయోగం కోసం పూర్వికులు తవ్వించిన నీటి వనరులు కనుమరుగవుతున్నాయి.

Updated : 26 Jun 2024 06:53 IST

ఆందోళనలో పట్టణ వాసులు

చెరువు పోరంబోకు భూమిలో  నిర్మాణం

న్యూస్‌టుడే, కావలి: కావలి పట్టణ పరిధిలోని చెరువులు, నీటి గుంతలు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నా.. అధికారులు స్పందించడం లేదు. ఫలితంగా ప్రజోపయోగం కోసం పూర్వికులు తవ్వించిన నీటి వనరులు కనుమరుగవుతున్నాయి. మందాటి చెరువు కబ్జాల చెరలో చిక్కిశల్యమవుతోంది. రాజకీయ, ఆర్థిక బలమే పెట్టుబడిగా ఎవరికి వారు పూడ్చేసి.. భవనాలు నిర్మిస్తుండటంతో.. చెరువులోకి నీరు చేరడం కష్టమవుతోంది. 

పచ్చదనం ఒట్టిమాటేనా

మందాటి చెరువు విస్తీర్ణం 133 ఎకరాలు కాగా..  అందులో 15 ఎకరాలు ఆక్రమించారు. పరిరక్షణతో పాటు పరిసరాల్లో పచ్చదనం అభివృద్ధి చేస్తామని గతంలో పురపాలక అధికారులు జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు నివేదించారు. కానీ, ఆచరణలో ఆ దిశగా అడుగులు పడలేదు. మరోవైపు ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. 

హెచ్చరికల అమలేదీ?

కనుమూరి భాస్కరరెడ్డి, విశ్రాంత అధ్యాపకులు, 

అధ్యక్షుడు, చెరువు పరిరక్షణ సమితి మందాటితో పాటు పాపిరెడ్డి చెరువునూ ఆక్రమిస్తున్నారు. మందాటి చెరువు రాళ్లగుట్ట పోరంబోకు భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. రెవెన్యూ తరఫున హెచ్చరిక ఏర్పాటు చేసినా.. ఖాతరు చేయడం లేదు. 

నివేదికలు తయారు చేస్తున్నాం

శీనానాయక్, ఆర్డీవో, కావలి

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సమగ్ర నివేదికలు తయారవుతున్నాయి. నీటి వనరుల్లో నిర్మాణాలు తగదు. వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని