logo

నిర్లక్ష్యం.. కలుషిత నీటికి సాక్ష్యం..

కోవూరు మండలం పడుగుపాడు సచివాలయం-3 ప్రాంగణంలోని రక్షిత మంచినీటి ట్యాంకు ఇది. పగుళ్లిచ్చి.. పాచిపట్టి నీరు కారుతోంది. కనీసం శుభ్రం చేయడం లేదు.

Published : 26 Jun 2024 02:49 IST

ఈనాడు, నెల్లూరు: కోవూరు మండలం పడుగుపాడు సచివాలయం-3 ప్రాంగణంలోని రక్షిత మంచినీటి ట్యాంకు ఇది. పగుళ్లిచ్చి.. పాచిపట్టి నీరు కారుతోంది. కనీసం శుభ్రం చేయడం లేదు. ఏళ్లుగా పట్టించుకోకపోగా.. కనీసం నిర్వహణనూ విస్మరించారు. అలాగే గ్రామానికి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఇటీవల గుంటూరు, ఏలూరులో అతిసారంతో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కలుషిత నీటితో పలువురు ఆసుపత్రిపాలవుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అధికారులు వారి పరిధిలో పరిస్థితులపై సమీక్షలు జరిపి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇక్కడ అవేమీ కనిపించడం లేదు.  ఏళ్లుగా నెలకొన్న ఈ దుస్థితిని ఇప్పటికైనా చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని