logo

Ysrcp: బరితెగించిన వైకాపా గ్రావెల్‌ మాఫియా.. రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వకాలు

బుచ్చిరెడ్డిపాళెం మండల పరిధిలోని రామచంద్రాపురంలో వైకాపా గ్రావెల్‌ మాఫియా బరితెగిస్తోంది.  కొన్ని రోజులుగా  రాత్రి, పగలు తేడా లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వుతూ వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Updated : 24 Jun 2024 08:53 IST

మీడియా ప్రతినిధులపై దాడికి యత్నం

గ్రావెల్‌ తవ్వుతున్న అక్రమార్కులు

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: బుచ్చిరెడ్డిపాళెం మండల పరిధిలోని రామచంద్రాపురంలో వైకాపా గ్రావెల్‌ మాఫియా బరితెగిస్తోంది.  కొన్ని రోజులుగా  రాత్రి, పగలు తేడా లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వుతూ వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనుమతులు లేకుండా చేస్తున్నారన్న సమాచారంతో కొంతమంది మీడియా ప్రతినిధులు(ఈనాడు కాదు) అక్కడికి వెళ్లారు.  ఒక్కసారిగా అక్రమార్కులు మీడియా ప్రతినిధులను కులం పేరుతో దూషించి వారిపై దాడికి యత్నించారు.  అక్కడ జరుగుతున్న దందాను పోలీసులకు సమాచారమివ్వడంతో  వారంతా వాహనాల్లో పరారయ్యారు.  వైకాపా నాయకుడు రవీంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం మీడియా ప్రతినిధులు, బాధితులు సీˆఐ హైమారావుకు ఫిర్యాదు చేయగా, పొలం యజమాని రమణయ్య తన పొలంలో అనుమతి లేకుండానే గ్రావెల్‌ తవ్వకాలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని