logo

YSRCP: సీఐ, ఎస్సైపై వైకాపా నాయకుల దాడి!

నెల్లూరు జిల్లాలో వైకాపా నేతలు వీరంగం సృష్టించారు. సీఐ, ఎస్సైలపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..

Published : 29 May 2024 11:57 IST

ఆత్మకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైకాపా నేతలు వీరంగం సృష్టించారు. సీఐ, ఎస్సైలపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు మండలం మహిమలూరు పంచాయతీ బసరాజుపాలెంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం రాత్రి గ్రూపు డ్యాన్స్‌లు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకుని సీఐ వేణు, ఎస్సై ముత్యాలరావు గ్రామానికి వెళ్లారు. గ్రూపు డ్యాన్స్‌లు నిర్వహించవద్దని నిర్వాహకులకు చెప్పారు. దీనికి వారు అంగీకరించకుండా స్థానిక వైకాపా నేతల వద్దకు వెళ్లారు. దీంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే సీఐ, ఎస్సైలపై స్థానిక వైకాపా నేతలు దాడికి పాల్పడినట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు