logo

వరించిన మద్దతు

ధాన్యాగారంగా పేరున్న ఇందూరు జిల్లా రైతులకు కేంద్రం తీపికబురు ప్రకటించింది. వరితో పాటు 14 రకాల వ్యవసాయోత్పత్తుల మద్దతు ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Updated : 20 Jun 2024 04:53 IST

వచ్చే పంట నుంచి కొత్త ధరలు
న్యూస్‌టుడే, ఆర్మూర్‌

ధాన్యాగారంగా పేరున్న ఇందూరు జిల్లా రైతులకు కేంద్రం తీపికబురు ప్రకటించింది. వరితో పాటు 14 రకాల వ్యవసాయోత్పత్తుల మద్దతు ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. వరికి రూ.117, మొక్కజొన్నకు రూ.135, సోయాకు రూ. 292, నువ్వులకు రూ. 632, పొద్దుతిరుగుడుకు రూ.520, పత్తికి రూ.501, వేరుసెనగకు రూ. 406.. ఇలా ధరలు పెంచి సాగును ప్రోత్సహించింది. గతంతో పోల్చుకుంటే కాస్త ఎక్కువగానే ‘మద్దతు’ ఇచ్చింది. ముఖ్యంగా నూనెగింజల సాగుకు ఊతమిచ్చేలా నిర్ణయం ఉంది.

8.50 లక్షల ఎకరాల్లో

జిల్లావ్యాప్తంగా ప్రతి సీజన్‌లో 5.40 లక్షల ఎకరాల సాగులో ఒక్క వరి పంటనే 4.30 లక్షల ఎకరాల్లో పండుతోంది. రెండు సీజన్లలో కలిపి 8.50 లక్షల ఎకరాల్లో ఈ ఒక్క పంటకే రైతులు మొగ్గుచూపుతున్నారు. ఏటా 2.55 కోట్ల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఇందులో అధిక భాగం భారత ఆహార సంస్థ సేకరిస్తోంది. దేశంలోనే అత్యధికంగా వరి పండించే ప్రాంతంగా మారిన తెలంగాణలో అత్యధిక సాగు ప్రాంతాల్లో ఒకటిగా నిజామాబాద్‌ ఉంది. ఈ తరుణంలో ధాన్యం ధరకు మద్దతు పెంచడం కర్షకులకు ఎంతో కలిసివస్తోంది. దీనికి తోడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సర్కారు కూడా సన్నధాన్యానికి అదనంగా రూ. 500 బోనస్‌ ఇస్తామని ప్రకటించడంతో ఇక అన్నదాతల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని