logo

రూపుదిద్దుకోనున్న డిజిటల్‌ గ్రంథాలయం

జిల్లాలోని చారిత్రక గ్రంథాలయం.. ప్రముఖ నవలా రచయిత వట్టికోట ఆళ్వార్‌స్వామి ‘ప్రజల మనిషి’ నవలలో పేర్కొన్న పఠనాలయం.. నగరంలోని బాపూజీ వచనాలయం.. అభివృద్ధి బాటలో కొనసాగుతోంది.

Published : 20 Jun 2024 03:14 IST

రూ.2.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

చదువుతున్న ఉద్యోగార్థులు

జిల్లాలోని చారిత్రక గ్రంథాలయం.. ప్రముఖ నవలా రచయిత వట్టికోట ఆళ్వార్‌స్వామి ‘ప్రజల మనిషి’ నవలలో పేర్కొన్న పఠనాలయం.. నగరంలోని బాపూజీ వచనాలయం.. అభివృద్ధి బాటలో కొనసాగుతోంది. ప్రధాన బస్టాండు, రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న ఈ పుస్తక నిలయానికి నిత్యం వందల సంఖ్యలో పాఠకులు వస్తుంటారు. ప్రాంగణమంతా పాఠకులతో సందడిగా ఉంటుంది. ఉన్న గదులు సరిపోక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని అభివృద్ధి చేయాలని వచనాలయ కమిటీకి విన్నవించారు. స్పందించిన కమిటీ కార్యవర్గం నూతన భవన నిర్మాణానికి తీర్మానించింది.

రూ. 80 లక్షలతో పనులు ప్రారంభం

బాపూజీ వచనాలయంలో గతనెలలో నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.2.50 కోట్ల అంచనా వ్యయంతో డిజిటల్‌ గ్రంథాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. వచనాలయ ప్రాంగణంలో ఉన్న దుకాణ సముదాయాల ద్వారా వచ్చే కిరాయి నిధులు రూ.80 లక్షలతో పనులు మొదలుపెట్టారు. ఇందులో విశాలమైన గదులతో పాటు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ వివిధ విభాగాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలతో పాటు ఆన్‌లైన్‌లో సమాచారం ఉచితంగా అందిస్తూనే.. కంప్యూటర్లు, ఉచిత వైఫై, ఏసీలు ఏర్పాటు చేస్తున్నారు. పాఠకులు, ఉద్యోగార్థులు కూర్చొని భోజనం చేసేందుకు ప్రత్యేకంగా గదులు నిర్మించనున్నారు. అరుదైన చరిత్ర పుస్తకాలను డిజిటలైజేషన్‌ చేయాలని నిర్ణయించారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు ఆధునికీకరించనున్నారు. అభ్యర్థులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించేందుకు దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని కమిటీ ప్రతినిధులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని