logo

Telangana News: నీళ్లనుకొని యాసిడ్‌ తాగారు

వస్త్ర దుకాణంలో షాపింగ్‌ కోసం వచ్చిన వ్యక్తికి.. సంబంధిత సిబ్బంది నీళ్లనుకొని యాసిడ్‌ బాటిల్‌(సీసా) ఇచ్చారు. ఆ విషయాన్ని గమనించని అతను యాసిడ్‌ తాగి ఆసుపత్రి పాలైన ఘటన నిజామాబాద్‌లో శనివారం చోటుచేసుకొంది. బాధితుడి కథనం ప్రకారం.

Updated : 26 Jun 2022 08:57 IST

ఇద్దరికి తీవ్ర అస్వస్థత
నిజామాబాద్‌లోని ఓ వస్త్ర దుకాణంలో ఘటన

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు విజయ్‌

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: వస్త్ర దుకాణంలో షాపింగ్‌ కోసం వచ్చిన వ్యక్తికి.. సంబంధిత సిబ్బంది నీళ్లనుకొని యాసిడ్‌ బాటిల్‌(సీసా) ఇచ్చారు. ఆ విషయాన్ని గమనించని అతను యాసిడ్‌ తాగి ఆసుపత్రి పాలైన ఘటన నిజామాబాద్‌లో శనివారం చోటుచేసుకొంది. బాధితుడి కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం మహ్మద్‌నగర్‌కు చెందిన విజయ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు పెళ్లి దుస్తులు కొనుగోలు చేయడానికి నిజామాబాద్‌ ఒకటో ఠాణా పరిధిలోని ఓ వస్త్ర దుకాణానికి వచ్చారు. కొద్ది సేపటి తర్వాత విజయ్‌కు దాహం వేయగా నీళ్లు కావాలని సిబ్బందిని అడిగాడు. ఓ వ్యక్తి నీళ్ల సీసా తెచ్చి ఇచ్చాడు. తెలుపు రంగులోనే ఉండటంతో బాధితుడు తాగేశాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న మరొక సిబ్బంది కూడా తాగారు. ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు, యాజమాన్య ప్రతినిధులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విజయ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఒకటో ఠాణా పోలీసులు విచారణ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని