logo

మాజీ గవర్నర్‌ మురళీధర్‌ కన్నుమూత

రాష్ట్ర మాజీ గవర్నరు మురళీధర్‌ చంద్రకాంత్‌ భండారి (95) కన్నుమూశారు. శనివారం రాత్రి ముంబయిలో తుదిశ్వాస విడిచారు. 2007 నుంచి 2013 వరకు రాష్ట్రానికి భండారి విశిష్ట సేవలందించారు.

Published : 17 Jun 2024 03:56 IST

మురళీధర్‌ చంద్రకాంత్‌ భండారి 

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్ర మాజీ గవర్నరు మురళీధర్‌ చంద్రకాంత్‌ భండారి (95) కన్నుమూశారు. శనివారం రాత్రి ముంబయిలో తుదిశ్వాస విడిచారు. 2007 నుంచి 2013 వరకు రాష్ట్రానికి భండారి విశిష్ట సేవలందించారు. రాజ్‌భవన్‌లో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకునే వారు. ఆయన మృతిపట్ల గవర్నరు రఘుబర్‌దాస్, ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి, మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పీసీసీ అధ్యక్షులు శరత్‌ పట్నాయక్, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని