logo

ప్రాణం తీసిన పాతకక్షలు

పాత కక్షల నేపథ్యంలో బావ తన బావమరిదిని నాటు తుపాకీతో కాల్చి చంపిన ఘటన గజపతి జిల్లాలో చర్చనీయాంశమైంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం మేరకు..

Published : 17 Jun 2024 04:02 IST

కైలాస్‌ నాయక్‌ (పాత చిత్రం)

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పాత కక్షల నేపథ్యంలో బావ తన బావమరిదిని నాటు తుపాకీతో కాల్చి చంపిన ఘటన గజపతి జిల్లాలో చర్చనీయాంశమైంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం మేరకు.. మోహన ఠాణా పరిధిలోని సికిలిపోదర్‌ పంచాయతీ బలియాగునికి చెందిన కైలాష్‌ నాయక్‌ (55) శనివారం సాయంత్రం కట్టెల కోసం అడవికి వెళ్లాడు. రాత్రైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెళ్లి చూసేసరికి శవమై పడి ఉన్నాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా వారు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరీక్ష నిమిత్తం బ్రహ్మపుర తరలించారు. ఆయనతో పాటు తన బావ ఉదయ్‌ నాయక్‌ కూడా అడవికి వెళ్లినట్లు గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. ఆదివారం ఉదయం నిందితుడు ఉదయ్‌ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నామని ఠాణా అధికారి బసంత్‌ శెఠి తెలిపారు. వారిరువురి మధ్య గతంలో గొడవలు జరిగాయని, పాతకక్షల నేపథ్యంలో ఉదయ్, తన బావమరిదిని తుపాకీతో కాల్చి హతమార్చినట్లు కైలాష్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని