logo

కారు, ద్విచక్ర వాహనం ఢీ: ఒకరి దుర్మరణం

కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలైన ఘటన మల్కాన్‌గిరి సమితిలో జరిగింది.

Updated : 20 Jun 2024 06:20 IST

సంఘటన స్థలంలో ఉన్న కారు, ద్విచక్ర వాహనం

మల్కాన్‌గిరి, న్యుస్‌టుడే: కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలైన ఘటన మల్కాన్‌గిరి సమితిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం జయపురం నుంచి మల్కాన్‌గిరికి వెళ్తున్న ఓ కారు పండ్రిపణి పంచాయతీ బిజాఘాటి గ్రామం వద్ద అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న సిగ్నల్‌ బోర్డును అనంతరం ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఒకరు మృతి చెందారు. ఇద్దరు చికిత్స పొందుతున్నారు. కారులో ఉన్న ఇద్దరు పరారయ్యారు. మల్కాన్‌గిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు మల్కాన్‌గిరి పట్టణానికి చెందిన నృత్యారావుదిగా తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు, క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు.


ట్రక్కు, గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా

 

ఘటనా స్థలంలో బోల్తా పడిన ట్యాంకర్‌

జయపురం, న్యూస్‌టుడే: జయపురం సమితి బర్నిఫుట్‌ పంచాయతీ కార్యాలయం సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ట్రక్కు, గ్యాస్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తా పడ్డాయి. ఐఐసీ ఈశ్వర్‌ తాండి తెలిపిన వివరాల ప్రకారం.. 14 చక్రాల ట్రక్కు జయపురం నుంచి కొరాపుట్‌కు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న గ్యాస్‌ ట్యాంకర్‌ బ్రేక్‌ ఫెయిల్‌ అయ్యి బోల్తా పడింది. దీంతో ట్రక్కు అదుపు తప్పి మూడు దుకాణాలపైకి దూసికెళ్లి బోల్తా పడింది. ఘటనలో దుకాణాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు, అగ్నిమాపక శాఖ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. రెండు వాహనాలు సీజ్‌ చేసి, చోదకులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని