logo

విపక్ష నేతగా నవీన్‌ పట్నాయక్‌

బిజద అధ్యక్షుడు, మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ విపక్ష నేతగా ఎన్నికయ్యారు. బుధవారం సాయంత్రం భువనేశ్వర్‌లోని శంఖభవన్‌లో సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలంతా నవీన్‌ పేరు ప్రతిపాదించగా ఆయన అంగీకరించారు.

Published : 20 Jun 2024 03:36 IST

ఎన్నికైన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న నవీన్‌ పట్నాయక్‌ 

భువనేశ్వర్, న్యూస్‌టుడే: బిజద అధ్యక్షుడు, మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ విపక్ష నేతగా ఎన్నికయ్యారు. బుధవారం సాయంత్రం భువనేశ్వర్‌లోని శంఖభవన్‌లో సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలంతా నవీన్‌ పేరు ప్రతిపాదించగా ఆయన అంగీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సభలో ఉపనేతగా ప్రసన్న ఆచార్య ఉంటారని, బిజద చీఫ్‌ విప్‌గా ప్రమీలా మల్లిక్, డిప్యూటీ చీఫ్‌ విప్‌గా ప్రతాప్‌ దేవ్‌లను నియమించినట్లు వెల్లడించారు. బిజద పరాజయానికి కారణాలపై కులంకషంగా చర్చ జరిగిందని, భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ప్రజలతో మమేకమవుతామని పార్టీ నాయకులంతా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని