logo

సముద్రంలో మునిగి యువకుడు గల్లంతు

అర్జిపల్లి మెరైన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని చిన్న అర్జిపల్లి వద్ద  సముద్రంలో మునిగి ఓ యువకుడు గల్లంతయ్యాడు.

Published : 20 Jun 2024 10:59 IST

బ్రహ్మపురనగరం : గంజాం జిల్లా అర్జిపల్లి మెరైన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని చిన్న అర్జిపల్లి వద్ద  సముద్రంలో మునిగి ఓ యువకుడు గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న గంజాం కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ యువకుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని