logo

ఎమ్మెల్యే చొరవతో పరిష్కారం

బ్రహ్మపుర మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఈఎంసీ) 14వ వార్డులోని నీలకంఠేశ్వర ఆలయం పక్కన కొన్ని నెలలుగా కుప్పలుగా పేరుకుపోయిన కొబ్బరిబొండాలు, ఇతర పూజా వ్యర్థాలతో అపారిశుద్ధ్యం తీవ్రంగా ఉండేది.

Updated : 25 Jun 2024 06:50 IST

భయపెట్టిన అపారిశుద్ధ్యం...
బ్రహ్మపుర బజారు, న్యూస్‌టుడే

 నీలకంఠేశ్వర మందిర పరిసరాలు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అనిల్‌

బ్రహ్మపుర మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఈఎంసీ) 14వ వార్డులోని నీలకంఠేశ్వర ఆలయం పక్కన కొన్ని నెలలుగా కుప్పలుగా పేరుకుపోయిన కొబ్బరిబొండాలు, ఇతర పూజా వ్యర్థాలతో అపారిశుద్ధ్యం తీవ్రంగా ఉండేది. ఈ సమస్య బ్రహ్మపుర ఎమ్మెల్యే కె.అనిల్‌కుమార్‌ చొరవతో సోమవారం పరిష్కారమైంది. నీలకంఠేశ్వర మందిరం నుంచి అటు చెరువు, ఇటు శ్మశానం మధ్యలో కొన్నినెలలుగా కొబ్బరిబొండాల వ్యర్థాలు పేరుకుపోయిన సంగతి తెలిసిందే. దీనిపై పలుమార్లు కార్పొరేటరు, ఆ ప్రాంత ప్రజలు బీఈఎంసీకి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. సమస్య తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్‌ స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి పరిసరాలు పరిశీలించారు. అనంతరం బీఈఎంసీ ఉపకమిషనర్‌ ఆశీర్వాద్‌ పరిడాను పిలిపించి వాటిని వెంటనే తొలగించి, ఆ స్థలాన్ని శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ వెంటనే పరిడా బీఈఎంసీ పారిశుద్ధ్య సిబ్బందితో కొబ్బరిబొండాలు, ఇతర వ్యర్థాలు తొలగింపజేశారు. కొన్ని నెలలుగా అపారిశుద్ధ్యంగా ఉన్న స్థలం వెంటనే శుభ్రపరచడంతో మందిరం కమిటీ ప్రతినిధులు, ఆయా ప్రాంతవాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ్యుడు అనిల్‌కుమార్‌ వెంట భారతీయ జనతా పార్టీ నాయకులు తూతిక గోపి, అశోక్‌ శుక్లా తదితరులున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని