logo

కిస్‌ కబ్జా చేసిన భూములపై ఆరా

భువనేశ్వర్‌ చందకా అడవి పరిధిలోని 4.032 హెక్టార్ల భూములను ‘కిస్‌’ యాజమాన్యం కబ్జా చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని గతంలో నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలు కాలేదు.

Published : 25 Jun 2024 04:17 IST

ఖుర్దా కలెక్టరుకు కేంద్రమంత్రి ఓరం లేఖ

జోయల్‌ ఓరం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌ చందకా అడవి పరిధిలోని 4.032 హెక్టార్ల భూములను ‘కిస్‌’ యాజమాన్యం కబ్జా చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని గతంలో నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలు కాలేదు. ‘కిస్‌’ వ్యవస్థాపకుడు అచ్యుత సామంత బిజద అగ్రనేత కావడం, అప్పట్లో కొంధమాల్‌ ఎంపీగా ఉండడంతో ఖుర్దా జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అటవీ భూములను అడ్డగోలుగా ‘కిస్‌’ యాజమాన్యానికి బదిలీ చేశారు. కబ్జా చేసిన స్థలంలో నిర్మాణాలూ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోయల్‌ ఓరం ఈ నెల 21న ఖుర్దా కలెక్టరు చంచల్‌ రాణాకు లేఖ రాశారు. చందకా అటవీ భూముల బదిలీ ప్రక్రియ నిలుపు చేసి, అన్ని కోణాల్లో పరిశీలించి నివేదిక పంపించాలని ఆదేశించారు. దీంతో బదిలీ ప్రక్రియ నిలుపుదల చేసి పరిస్థితి సమీక్షిస్తున్నామని ఆదివారం విలేకరులకు చెప్పారు. ఈ వ్యవహారంలో మాజీ ఎంపీ అచ్యుత మీడియా ముందు పెదవి విప్పలేదు. మరోవైపు భువనేశ్వర్‌ ఏకామ్ర ఎమ్మెల్యే బాబూసింగ్‌ విలేకరులతో అటవీ భూములు ఆక్రమించిన వారిని ప్రభుత్వం విడిచి పెట్టబోదని, చట్టపరంగా చర్యలు తప్పవని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని