logo

స్వామికి ఆకుపసర్లతో చికిత్స

శ్రీక్షేత్రంలోని ఒనొసొనో (చీకటి మందిరం)లో సోమవారం దైతాపతి సేవాయత్‌లు ఆకుపసర్లతో జగన్నాథునికి వైద్యం చేశారు.

Published : 25 Jun 2024 04:24 IST

సింహద్వారంలో పొట్టి దియోకు మంగళ హారతి

గోపాలపూర్, న్యూస్‌టుడే: శ్రీక్షేత్రంలోని ఒనొసొనో (చీకటి మందిరం)లో సోమవారం దైతాపతి సేవాయత్‌లు ఆకుపసర్లతో జగన్నాథునికి వైద్యం చేశారు. ఒంట్లో పెరిగిన వేడి తగ్గించడానికి పంచామృతం, మజ్జిగ అర్పించారు. పథ్యంగా ఖర్జూరం, పండ్లు, తేనె నైవేథ్యంగా సమర్పించారు. జ్వరం బారిన పడిన స్వామికి ఒనొసొనో మందిరంలో గోప్య చికిత్స, ఉపచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు శ్రీక్షేత్రంలో పొట్టిదియోలకు భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. మునుపటి రద్దీ, సందడి కనిపించడం లేదు. పూరీ వస్తున్నవారంతా బ్రహ్మగిరి అలాడినాథుని దర్శనానికి వెళుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని