logo

Odisha: రోడ్డు ప్రమాదంలో అధికారి మృతి

మల్కానిగిరి జిల్లా చిత్రకొండ సమితి అదనపు సమితి విద్యాధికారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Published : 25 Jun 2024 16:59 IST

మల్కాన్ గిరి: మల్కానిగిరి జిల్లా చిత్రకొండ సమితి అదనపు సమితి విద్యాధికారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే మంగళవారం ఉదయం చిత్రకొండ అదనపు సమితి విద్యాధికారి అంజన్ కుమాడ్‌ చౌధురి (59)తో పాటు విద్యాధికారి ద్విచక్ర వాహనంలో మల్కానిగిరి నుంచి ఖైరపుట్ సమితి మీదుగా చిత్రకొండ వెళ్తున్న సమయంలో కుడుములుగుమ్మ పంచాయతీ హతిఆంబో గ్రామం మలుపు దగ్గర రెండు ద్విచక్ర వాహనాలు అతివేగంగా ఎదురుగా వచ్చి అంజన్ కుమాడ్ వాహనాన్ని ఢీకొన్నాయి. వెంటనే స్థానికులు అంజన్ కుమాడ్‌ని కుడుములుగుమ్మ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే అంజన్ కుమాడ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని