logo

Odisha: చెట్టును ఢీకొట్టిన కారు.. డ్రైవర్‌ మృతి

మల్కాన్‌గిరి జిల్లా మత్తిలి సమితి సింగల్బచ్ఛ గ్రామం వద్ద కారు చెట్టును ఢీకొని చోదకుడు మృతి చెందాడు.

Updated : 25 Jun 2024 17:21 IST

మల్కాన్ గిరి: మల్కాన్‌గిరి జిల్లా మత్తిలి సమితి సింగల్బచ్ఛ గ్రామం వద్ద కారు చెట్టును ఢీకొని చోదకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తె.. మంగళవారం ఉదయం మత్తిలి ఠాణా సంగం గ్రామానికి చెందిన తాపస్ కుమాడ్ మిత్ర (26) అనే యువకుడు కారులో ఛత్తీస్‌గఢ్‌ వెళ్తున్న సమయంలో సింగల్బచ్ఛ గ్రామం వద్ద కారు అదుపు తప్పి ఓ చెట్టుని ఢీకొంది. ప్రమాదంలో చోదకుడు మృతి చెందగా కారు నుజ్జు నుజ్జు అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని