logo

Parvatipuram: క్యాన్సర్‌ స్క్రీనింగ్ శిక్షణ కార్యక్రమం

పార్వతీపురం మండలం జిల్లా ఆసుపత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఎన్సీడీ ప్రాజెక్టు డైరెక్టర్ నర్సింగరావు ప్రారంభించారు.

Published : 18 Jun 2024 20:26 IST

పార్వతీపురం పట్టణం: పార్వతీపురం మండలం జిల్లా ఆసుపత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఎన్సీడీ ప్రాజెక్టు డైరెక్టర్ నర్సింగరావు ప్రారంభించారు. వైద్యులు స్టాఫ్‌ నర్సులు ఏఎన్ఎం లకు నెలరోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని ఆయన వివరించారు. 50 మంది ఒక బృందంగా ఏర్పాటు చేసి మూడు రోజులు పాటు శిక్షణ  అందిస్తామని, ఇలా జిల్లాలోని వైద్యాధికారులు స్టాఫ్ నర్సులు ఏఎన్ఎం లకు నెలరోజుల పాటు శిక్ష ఉంటుందని ఆయన తెలిపారు. నోటికి క్యాన్సర్, బ్రెస్ట్, గర్భాశయం ముఖద్వార్ క్యాన్సర్ మొదలైన వాటిని ఎలా స్క్రీన్ చేయాలి ఎటువంటి పరీక్షలు చేయాలి, అవసరం మేరకు రిఫరల్ ఎలా చేయాలి, అన్న అంశాలు నేర్పిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి వినోద్ కుమార్, పీవోఆర్‌బీ డాక్టర్ పీఎల్ రఘు కుమార్, డాక్టర్ శ్యామల, వైద్యులు, స్టాఫ్ నర్స్‌లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని