logo

Parvatipuram: భవనానికి పొంచి ఉన్న ప్రమాదం

వీరఘట్టం మండలం చిట్టపుడివలస పశువుల ఆసుపత్రి భవనానికి ముప్పు పొంచి ఉంది. ఆసుపత్రి భవనం పునాది రాళ్లు కదులుతున్నాయి.

Published : 18 Jun 2024 17:26 IST

వీరఘట్టం: వీరఘట్టం మండలం చిట్టపుడివలస పశువుల ఆసుపత్రి భవనానికి ముప్పు పొంచి ఉంది. ఆసుపత్రి భవనం పునాది రాళ్లు కదులుతున్నాయి. ఈ భావనంలోనే రూరల్ లైవ్ స్టాక్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారు. పశువుల వైద్యం కోసం రైతులు వస్తుంటారు. ప్రమాద ఘంటికలు మ్రోగక ముందే ఈ ఆసుపత్రని అద్దె భవనంలోకి మార్చాల్సిన అవసరం ఉంది. అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. దీనిపై పశువైద్యాధికారి పి. చైతన్య శంకర్ మాట్లాడుతూ పశువుల ఆసుపత్రి భవనం పరిస్థితిని ఉన్నతధికారుల దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు