logo

రహదారిని అభివృద్ధి చేస్తే రాజమార్గమే!

వీరఘట్టం మండలం కంబర నుంచి గరుగుబిల్లి మండలం రావివలస రహదారి అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టి పెడితే అనేక గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది.

Published : 18 Jun 2024 11:25 IST

వీరఘట్టం: వీరఘట్టం మండలం కంబర నుంచి గరుగుబిల్లి మండలం రావివలస రహదారి అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టి పెడితే అనేక గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. వీరఘట్టం, గరుగుబిల్లి, కురుపాం, జియ్యమ్మవలస మండలాల పరిధిలోని 221 గ్రామాల ప్రజలు రహదారి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా మండలాల ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రహదారి మెరుగుపడితే రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యాపారుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. వ్యవసాయ ఉత్పత్తులు క్షేత్ర స్థాయి నుంచి వాహనాలపై తరలించేందుకు సౌలభ్యంగా ఉంటుంది. రవాణా ఖర్చులు తగ్గుతాయి. భూముల విలువ పెరుగుతుంది. జిల్లాతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు అనుసంధానమవుతాయి. కాబట్టి నూతన ప్రభుత్వమైనా రహదారిపై దృష్టి పెట్టి తమను ఆదుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని