logo

డీఎల్‌ఎస్‌సీ వాయిదాపై గిరిజనుల ఆగ్రహం

గిరిజనుల పేరుతో నకిలీ వ్యక్తులు చలామణి అవుతున్నారని, వారిని గుర్తించడానికి ఐటీడీఏ పీవో అధ్యక్షతన జిల్లాస్థాయి కులధ్రువీకరణ పరిశీలన కమిటీ సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Published : 28 May 2023 02:29 IST

నినాదాలు చేస్తున్న ఏజేఏసీ ఛైర్మన్‌ ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే జయరాజు తదితరులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: గిరిజనుల పేరుతో నకిలీ వ్యక్తులు చలామణి అవుతున్నారని, వారిని గుర్తించడానికి ఐటీడీఏ పీవో అధ్యక్షతన జిల్లాస్థాయి కులధ్రువీకరణ పరిశీలన కమిటీ సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వాయిదా వేయడంపై ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఛైర్మన్‌ కె.ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు తదితరులు నిరసన వ్యక్తం చేశారు. గిరిజన ధ్రువపత్రాలతో ఉద్యోగాలు చేస్తున్న గిరిజనేతరులపై ఆరిక బలరాజు తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం డీఎల్‌డీసీని ఏర్పాటు చేశారు. ఉదయం 10.30కు ఐటీడీఏ కార్యాలయంలో హాజరు కావాలని పీవో నోటీసులు ఇచ్చారని గిరిజన జేఏసీ నాయకులు, ఫిర్యాదుదారు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్నా సమావేశం వాయిదా వేసినట్లు చెప్పలేదని, పీవో కూడా రాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులకు న్యాయం చేయాల్సిన ఐటీడీఏ పీవో ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. దీనిపై జేఏసీలో చర్చించి, ఉద్యమం చేస్తామని తెలిపారు.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని