logo

మద్యం దుకాణం వద్ద ఘర్షణ ముగ్గురికి కత్తి పోట్లు

నగరంలోని పూల్‌బాగ్‌ రోడ్డులో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద జరిగిన ఘర్షణలో ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు.

Published : 18 Jun 2024 02:06 IST

విజయనగరం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: నగరంలోని పూల్‌బాగ్‌ రోడ్డులో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద జరిగిన ఘర్షణలో ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు. ఈ ఘటన ఆదివారం జరగ్గా.. సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. పూల్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన ఎన్‌.సతీష్, బి.హరీష్, బి.పృథ్వీ మద్యం కొనుగోలు చేసేందుకు దుకాణానికి వెళ్లారు. అదే సమయంలో స్థానికంగా నివాసముండే అసదుద్దీన్, నారాయణ వచ్చారు. వరుసలో నిల్చునే క్రమంలో సతీష్, అసదుద్దీన్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన అసదుద్దీన్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. అడ్డుకునేందుకు వెళ్లిన హరీష్, పృథ్వీని సైతం పొడిచి, పరారయ్యాడు. స్థానికులు స్పందించి, క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని రెండో పట్టణ సీఐ కె.రామారావు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని