logo

అనుమానాస్పదస్థితిలో వివాహిత మృత్యువాత

అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మృతిచెందిన ఘటన గజపతినగరంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్‌ వివరాల మేరకు.. స్థానిక బంగారమ్మ కాలనీకి చెందిన అనూష అలియాస్‌ తనూజ(22)కు నాలుగు నెలల కిందట వివాహమైంది.

Published : 18 Jun 2024 02:11 IST

గజపతినగరం, న్యూస్‌టుడే: అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మృతిచెందిన ఘటన గజపతినగరంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్‌ వివరాల మేరకు.. స్థానిక బంగారమ్మ కాలనీకి చెందిన అనూష అలియాస్‌ తనూజ(22)కు నాలుగు నెలల కిందట వివాహమైంది. ఆమె భర్త ఆర్మీలో పని చేస్తున్నాడు. ఆదివారం గ్రామ దేవత పండగ ఉండటంతో తనూజ కన్నవారింటికి వచ్చింది. రాత్రి 10 గంటల వరకు ఇంట్లోనే ఉంది. ఆ సమయంలో ఫోన్‌ రావడంతో ఇంటి నుంచి బయటికి వెళ్లింది. రాత్రంతా కనపడకపోవడంతో కుటుంబీకులు వెతికారు. సమీపంలోని పశువుల శాల వద్ద విగతజీవిగా పడిఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఆమె ఇంటి నుంచి వెళ్లిన తర్వాత తన స్నేహితురాలు, సోదరుడికి సందేశాలను పంపించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతంలో సన్నిహితంగా ఉండే ఓ యువకుడు ఫొటోలు, వీడియోల పేరిట బెదిరిస్తున్నాడని చెప్పిందని, తన భర్తకు పంపిస్తాడన్న భయంతో చనిపోతున్నట్లు పేర్కొందన్నారు. ఈమేరకు వారిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మరోవైపు అర్ధరాత్రి సమయంలో సదరు వ్యక్తి ఇంటికి వెళ్లిన బాధితులు అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశారని, వారు గజపతినగరం ఆసుపత్రిలో చేరడంతో వివరాలు ఆరా తీస్తున్నట్లు చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని