logo

ఇంటిపై పిడుగుపాటు

పాచిపెంట మండల కేంద్రంలోని ఓ ఇంటిపై పిడుగు పడింది. సోమవారం ఉదయం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.

Published : 18 Jun 2024 02:15 IST

పాచిపెంట, న్యూస్‌టుడే: పాచిపెంట మండల కేంద్రంలోని ఓ ఇంటిపై పిడుగు పడింది. సోమవారం ఉదయం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఆ సమయంలో స్థానిక గాజులవీధిలోని ఓ డాబా ఇంటి మెట్లపై నిర్మించిన స్లాబుపై పెద్దశబ్దంతో పిడుగు పడింది. కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్లాబుకు రంధ్రం పడగా మెట్లు దెబ్బతిన్నాయి. సమీపంలోని గోడ కొంతమేర బీటలు వారింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని