logo

వర్షాలు మిగిల్చిన విధ్వంసం

గత రెండు రోజులుగా మన్యంలో కురుస్తోన్న వర్షాలతో కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద తాకిడికి పలు రహదారులు కొట్టుకుపోయాయి. పాచిపెంట మండలంలో తారురోడ్లు ఛిద్రమయ్యాయి.

Published : 18 Jun 2024 02:21 IST

న్యూస్‌టుడే, పాచిపెంట: గత రెండు రోజులుగా మన్యంలో కురుస్తోన్న వర్షాలతో కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద తాకిడికి పలు రహదారులు కొట్టుకుపోయాయి. పాచిపెంట మండలంలో తారురోడ్లు ఛిద్రమయ్యాయి. దీంతో గిరిజనుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పూడి నుంచి కొండమోసూరు వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర రూ.6 కోట్లతో బీటీ రోడ్డు పనులు చేపడుతున్నారు. అలాగే కొండమోసూరు కేరంగి కూడలి నుంచి కేరంగి వరకు మరో రూ.6 కోట్లతో ఆరు కి.మీ బీటీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. పూడి-కొండమోసూరు మార్గంలో 4 కి.మీ రోడ్డు పనులకు నిర్మాణ సామగ్రి సిద్ధం చేశారు. కేరంగి రహదారిలో కల్వర్టులు, కొంతమేరకు రహదారి పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరద ఉద్ధృతికి ఆయా రహదారులు కొన్నిచోట్ల కోతకు గురి కాగా... మరికొన్నిచోట్ల కొట్టుకుపోయాయి. దీంతో గిరిజన గ్రామాలకు ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై ఐటీడీఏ జేఈ సత్యనారాయణ మాట్లాడుతూ వర్షాలు తగ్గిన తర్వాత రహదారులకు మరమ్మతులు చేయిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని