logo

Parvatipuram: ప్రజా సంక్షేమమే తెదేపా లక్ష్యం

దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పాలన సాగించారని ఆయన అడుగుజాడల్లో తెదేపా నడుస్తుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు.

Published : 18 Jun 2024 19:29 IST

పార్వతీపురం పట్టణం: దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పాలన సాగించారని ఆయన అడుగుజాడల్లో తెదేపా నడుస్తుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెదపింకి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పుట్టిందే పేదల కోసం అని, నేటికీ అదే బాటలో వెళ్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. నాయకులు వేణు, సీతారాం, వెంకట నాయుడు, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని