logo

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

బందలుప్పి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పుస్తకాలు అందజేశారు.

Published : 15 Jun 2024 13:46 IST

పార్వతీపురం పట్టణం: బందలుప్పి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పుస్తకాలు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన విద్యార్థులకు స్వర్ణయంగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. డీఈవో పగడాలమ్మ, నాయకులు వెంకట్ నాయుడు, సీతారాం, చంద్రమౌళి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు