logo

Parvathipuram Manyam: జిల్లాకేంద్రంలో రెండు కొత్త బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే బోనాల విజయ్ చంద్ర కోరారు.

Published : 10 Jul 2024 10:05 IST

పార్వతీపురం టౌన్‌ :  ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే బోనాల విజయ్ చంద్ర కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం ఆర్టీసీ డిపోలో రెండు బస్సులను ప్రారంభించారు. ఒకటి విజయవాడ, మరొకటి విశాఖపట్నం మార్గాల్లో నడిపేందుకు  కొత్త బస్సులను ప్రభుత్వం సమకూర్చడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి పల్లెకు ఆర్టీసీ సేవలు అందేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే సూచించారు. డిపో మేనేజర్ కనకదుర్గ, నాయకులు సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు