logo

మీటరు గిర్రు గిర్రు...

వేసవి అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. సాయంత్రం ఆరు గంటలైనా వేడి గాలుల తీవ్రత తగ్గడం లేదు.

Updated : 28 May 2024 06:01 IST

అమాంతం పెరిగిన విద్యుత్తు వినియోగం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వేసవి అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. సాయంత్రం ఆరు గంటలైనా వేడి గాలుల తీవ్రత తగ్గడం లేదు. ఈ ఏడాది జిల్లాలోని పలు మండలాల్లో అత్యధికంగా 45 నుంచి 47 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాణిజ్య దుకాణాలు కూడా వ్యాపారాలు లేక ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వెలవెలబోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఎక్కువ మంది ఇంటికే పరిమితమవుతున్నారు. తద్వారా జిల్లాలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. ఉపశమనం కోసం గాలి పంకాలు, ఏసీలు వాడకం ఎక్కువైంది. జనవరితో పోలిస్తే ఏప్రిల్, మేలో వాడకం గణనీయంగా ఎక్కువైంది. వాతావరణం చల్లబడే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క అధిక లోడ్‌తో సరఫరాలో తరచూ అంతరాయాలు తలెత్తుతున్నాయి.

రోజుకు 11 మి.యూ వినియోగం...

గత రెండు నెలలుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, రిఫ్రిజ్‌రేటర్ల వాడకం పెరిగింది. మరోపక్క జిల్లా వ్యాప్తంగా నూతన వాణిజ్య సముదాయాలు అందుబాటులోకి రావడంతో వేసవి ఆరంభం నుంచే అదనపు లోడుపై ప్రభావం పడింది. జనవరి నెల బిల్లింగ్‌ ఆధారంగా రోజుకు 9.33 మి.యూ వాడగా, ప్రస్తుతం రోజుకు 11 మి.యూ వినియోగం అవుతోంది. శీతాకాలంగా భావించే జనవరి నెలతో పోలిస్తే ఇది సరాసరిన 1.67 మి.యూ ఎక్కువ. ఎండ తీవ్రత దృష్ట్యా జూన్‌లోనూ రోజుకు 11 మి.యూ వరకు వాడకం ఉంటుందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని