logo

ఎర్రచందనం దుంగల పట్టివేత

కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే: రవాణాకు సిద్ధం చేస్తున్న ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. కొమరోలు మండలం చింతలపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 13 Jun 2024 03:44 IST

నిందితులు, స్వాధీనం చేసుకున్న సొత్తుతో అధికారులు 

కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే: రవాణాకు సిద్ధం చేస్తున్న ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. కొమరోలు మండలం చింతలపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చింతలపల్లె అటవీ ప్రాంతంలోని భైరవస్వామి తిప్ప నుంచి అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలించేందుకు అయిదుగురు వ్యక్తులు సిద్ధమయ్యారు. బుధవారం తెల్లవారుజామున ఆటోలోకి దుంగలు ఎక్కిస్తుండగా... కడప సబ్‌ కంట్రోల్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.చిరంజీవులు ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాడులు చేశారు. వారిలో ఇద్దరు పట్టుబడగా... ముగ్గురు పరారయ్యారు. దొరికినవారిని అదుపులోకి తీసుకుని.. 107 ఎర్రచందనం దుంగలు, ఆటో, ద్విచక్రవాహనం, మూడు చరవాణులు, రూ.30,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగల విలువ రూ.18 లక్షలు వరకు ఉంటుందని అంచనా. సిబ్బందికి చిక్కిన వారిలో తెలంగాణ రాష్ట్రం హయత్‌నగర్‌కు చెందిన రాజేంద్ర కుమార్, గిద్దలూరు మండలం గడికోటకు చెందిన వాసం వెంకట సుబ్బయ్య ఉన్నారు. వీరిని తిరుపతి ఎర్రచందనం ప్రత్యేక కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఆర్‌ఎస్‌ఐ దాడుల్లో పి.నరేష్, చింతలపల్లె ఎఫ్‌ఎస్‌వో జె.ఫిలిప్, ఎఫ్‌బీవో లక్ష్మా నాయక్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని