logo

చంద్రన్న ప్రమాణం... ఊరూరా సంబరం

కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌ సమీపంలో బుధవారం... రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వేళ జిల్లాలో సంబరాలు మిన్నంటాయి.

Published : 13 Jun 2024 03:59 IST

ఎల్‌ఈడీ తెరలపై వీక్షించిన జిల్లా ప్రజలు

చంద్రబాబుకు పూలు చల్లి, హారతి ఇస్తున్న తెలుగు మహిళలు
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌ సమీపంలో బుధవారం... రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వేళ జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. ఈ వేడుకను వీక్షించేందుకు వీలుగా ఒంగోలు నగరం, జిల్లాలోని పంచాయతీలు, మండల, పురపాలక కార్యాలయాల వద్ద అధికార యంత్రాంగం ఎల్‌ఈడీ తెరలు, టీవీలు ఏర్పాటు చేసింది. తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలోనూ ఆయా పార్టీల కార్యాలయలు, ప్రధాన కూడళ్లలో భారీ తెరలు అందుబాటులోకి తెచ్చారు. తెదేపా అధినేత బాబు, జనసేనాని పవన్‌కల్యాణ్‌ ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ... పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. ఈలలు, చప్పట్లు, నృత్యాలతో సందడి చేశారు. తెరపై వారు కనిపిస్తుండగా పూలు చల్లి, హారతులు పట్టారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నగరపాలక సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ భవన్, ఎన్టీఆర్‌ కళాక్షేత్రం, గాంధీపార్కులో తెరలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో భారీ కేకులు కోశారు.

యర్రగొండపాలెం: బాణసంచా కాల్చుతున్న తెదేపా నాయకులు

తరలిన కూటమి శ్రేణులు...

చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుకకు జిల్లా నుంచి ఎన్‌డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లాయి. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల ప్రజల కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో 32 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ఎక్కువమంది సొంత వాహనాలు ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా తరలివెళ్లారు. విజయవాడ శివారులోనే ట్రాఫిక్‌ స్తంభించడంతో... చాలామంది సభా ప్రాంగణానికి చేరుకోలేకపోయారు.జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై పూలు చల్లుతున్న అభిమాని

కేకు కోసి ఆనందం పంచుకుంటున్న తెదేపా నాయకులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని