logo

ట్రిపుల్‌ ఐటీ ప్రశ్నపత్రంపై విచారణ

ట్రిపుల్‌ ఐటీ ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం పరీక్ష కోసం ఓ అధ్యాపకుడు తయారు చేసిన ప్రశ్నపత్రం లీకైన ఘటనపై...

Published : 21 Jun 2024 03:02 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ట్రిపుల్‌ ఐటీ ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం పరీక్ష కోసం ఓ అధ్యాపకుడు తయారు చేసిన ప్రశ్నపత్రం లీకైన ఘటనపై... వైస్‌ ఛాన్సనర్‌ విజయ్‌ కుమార్‌ నేతృత్వంలోని బృందం గురువారం విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ వేవ్‌ అండ్‌ గైడెడ్‌ మీడియా’ సబ్జెక్ట్‌కు సంబంధించిన పేపరు తయారు చేసి పంపాలని... రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లోని అధ్యాపకులకు యూనివర్సిటీ వారు మే నెలలో సూచించారు. ఆ క్రమంలో ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ(ఎస్‌ఎస్‌ఎన్‌ ప్రాంగణం) అధ్యాపకుడు ఓ ప్రశ్నపత్రం రూపొందించారు. ఆయన బోధించే తరగతిలోని ఓ విద్యార్థికి వాట్సాప్‌ గ్రూపులో పంపారు. దీనిని విద్యార్థులు ఒకరికొకరు పంపుకొన్నారు. దీంతో విషయం కాస్తా యూనివర్సిటీ అధికారుల దృష్టికి వెళ్లింది. సదరు పరీక్ష జూన్‌ మొదటి వారంలో పూర్తయింది. నలుగురు పంపిన ప్రశ్నపత్రాల్లో... లీకైన పేపరు వినియోగించలేదని గుర్తించారు. అయినప్పటికీ బాధ్యతారాహిత్యంగా ప్రశ్నపత్రాన్ని లీకు చేయడంతో విచారణ చేపట్టారు. ఒంగోలు, ఇడుపులపాయ, నూజివీడు ప్రాంగణాల డైరెక్టర్లతో కలసి వీసీ విజయ్‌ కుమార్‌ వివరాలు సేకరించారు. బాధ్యుడైన అధ్యాపకుడిని, ప్రశ్నపత్రం షేర్‌ చేసిన విద్యార్థిని విచారించారు. ఘటనపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని