logo

చంద్రన్న గెలుపుతో వెంకన్న చెంతకు..

రాష్ట్రంలో కూటమి అఖండ విజయం సాధించడంతో పొన్నలూరు తెదేపా నాయకులు, కార్యకర్తలు మొక్కు చెల్లించుకునేందుకు సిద్ధమయ్యారు.

Published : 21 Jun 2024 03:04 IST

తిరుమలకు తెదేపా నాయకుల పాదయాత్ర

జెండా ఊపి పాదయాత్రను ప్రారంభిస్తున్న తెదేపా నాయకుడు సాంబశివయ్య, చిత్రంలో పార్టీ అభిమానులు

పొన్నలూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి అఖండ విజయం సాధించడంతో పొన్నలూరు తెదేపా నాయకులు, కార్యకర్తలు మొక్కు చెల్లించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. తెదేపా మండల అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే తిరుమలలోని స్వామి వారి చెంతకు పాదయాత్రగా వస్తామని తెదేపా నాయకులు తానికొండ మహేంద్ర, మాదాల నరేష్, గొర్రెపాటి కోటేశ్వరరావు, ముప్పరాజు పవన్, మహేంద్ర, చెరుకూరి చంద్ర, ముప్పరాజు బాలకృష్ణ, మాదాల ప్రసాదు తదితరులు మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, కొండపి ఎమ్మెల్యేగా గెలిచిన స్వామి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం మొక్కు చెల్లించేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా వెంకుపాలెం గ్రామంలోని రాములవారి ఆలయంలో మండల అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని