logo

తెల్లరాయి తరలిస్తుంటే చర్యలేవీ..!

ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా తెల్లరాయిని తవ్వి తరలిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గుంటుపల్లివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Published : 21 Jun 2024 03:06 IST

 డీటీ శ్రీనివాసులుకు ఫిర్యాదుచేస్తున్న  గుంటుపల్లి గ్రామస్థులు

పీసీపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా తెల్లరాయిని తవ్వి తరలిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గుంటుపల్లివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కడి అక్రమాలపై వారు  గురువారం అధికారులకు ఫిర్యాదు చేశారు. గుంటుపల్లి గ్రామ శివార్లలో.. ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది జేసీబీల సాయంతో ప్రభుత్వ భూముల్లో వారం రోజుల నుంచి తెల్లరాయి తవ్వి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. గతంలో అక్కడ గుంతలు తవ్వి వదిలేయడం వల్ల గేదెలు కాసేందుకు వెళ్లిన ఓ బాలుడు మృత్యువాతపడ్డాడన్నారు. భవిష్యత్తులో కూడా మేతకు వెళ్లే మూగజీవాలు సైతం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. అక్రమంగా తవ్వుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్‌ మాగం శ్రీనివాసులుకు గ్రామస్థులు వినతిపత్రం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని