logo

వైకాపా నేతల చెరలో భూములు

స్థానిక జాతీయ రహదారి పక్కనే మాచవరం సమీపంలో రూ.7కోట్ల విలువచేసే అయిదెకరాల భూములను వైకాపా నాయకులు ఆక్రమించుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published : 21 Jun 2024 03:08 IST

చర్యలు చేపట్టాలని మాచవరంవాసుల వినతి

డొంక పోరంబోకు భూమిని ఆక్రమించి నిర్మించిన ప్రహరీ

కనిగిరి, న్యూస్‌టుడే: స్థానిక జాతీయ రహదారి పక్కనే మాచవరం సమీపంలో రూ.7కోట్ల విలువచేసే అయిదెకరాల భూములను వైకాపా నాయకులు ఆక్రమించుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కబ్జాపర్వంపై  ఎన్నికలకు ముందే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మాచవరంవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు వారు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి వివరించగా, తక్షణం అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్థానిక వైకాపా ముఖ్య నాయకులు గ్రామంలోని కొండ, రోడ్డు పోరంబోకు స్థలాలను చెరబట్టారని వారు ఆరోపించారు. 

 రోడ్డు పోరంబోకు భూమిలో ఏర్పాటుచేసిన పిల్లర్లు 

చర్యలు తీసుకుంటాం

మాచవరంలో జాతీయ రహదారి పక్కనే ఆక్రమించుకున్న డొంక, రోడ్డు పోరంబోకు భూములను స్వాధీనం చేసుకుంటాం. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ భూములే. ఎవరూ ఆక్రమించకూడదు. గతంలో ఓ సారి హెచ్చరించినా మళ్లీ బరి తెగించిన విషయం మా దృష్టికి వచ్చింది. వెంటనే సిబ్బందిని పంపి తొలగింపజేస్తాం. ఆ స్థలంలో ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తాం. 

టీవీ రంగారావు, మున్సిపల్‌ కమిషనర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని