logo

వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన రామోజీ

వేలమందికి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నతులు రామోజీ రావు అని వక్తలు కొనియాడారు. స్థానిక కర్నూలు రోడ్డులోని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయంలో గురువారం రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభ జరిగింది.

Published : 21 Jun 2024 03:10 IST

రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మార్గదర్శి సిబ్బంది 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వేలమందికి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నతులు రామోజీ రావు అని వక్తలు కొనియాడారు. స్థానిక కర్నూలు రోడ్డులోని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయంలో గురువారం రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ ఒంగోలు కార్యాలయం మేనేజర్‌ కరణం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈనాడు పత్రిక స్థాపనతో ప్రజా చైతన్యం నింపారని,  సమాజానికి ఇతోధిక సేవలు చేశారని కొనియాడారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు కరవది రాఘవరావు, నరసింహశాస్త్రి, పి.మాలకొండయ్య, పిడికిటి వెంకటేశ్వర్లు, చింతల వెంకటేశ్వర్లు, యాక్సెస్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కె.ప్రకాష్, అకౌంటెంట్‌ కోటేశ్వరరావు, మార్గదర్శి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని