logo

రైతులను ఆదుకునేందుకు రూ.62.01 కోట్లు అవసరం

జిల్లాలో కరవు పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా నష్టపోయిన రైతులకు ఆదుకునేందుకు కేంద్రం సహకారం అందించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కోరారు.

Published : 21 Jun 2024 03:16 IST

కరవు చిత్రాలను తిలకిస్తున్న మంత్రి వీరాంజనేయ స్వామి, కలెక్టర్‌ దినేష్‌ కుమార్, జేసీ గోపాలకృష్ణ, కేంద్ర బృందం సభ్యులు  

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో కరవు పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా నష్టపోయిన రైతులకు ఆదుకునేందుకు కేంద్రం సహకారం అందించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కోరారు. కరవు పరిస్థితుల పరిశీలనకు జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు, జిల్లా అధికారులతో ఒంగోలు ప్రకాశం భవన్‌లోని కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంత్రి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. జిల్లాలోని 38 మండలాల్లో 31 వరకు కరవు ప్రాంతాలుగా గుర్తించినట్లు చెప్పారు. వాటిల్లోని 36,147 మంది రైతులు 29,713.64 హెక్టార్లలో వరి, శనగలు, మినుములు, చిరుధాన్యాలు మొదలగు పంటలు దెబ్బతిని నష్టపోయారని వివరించారు. వీరిని ఆదుకునేందుకు రూ.62.01 కోట్ల మేర నిధులు అవసరమని తెలిపారు. తొలుత కరవు పరిస్థితులను తెలుపుతూ వ్యవసాయం, జల వనరులు, ఆర్‌డబ్ల్యూఎస్, పశుసంవర్ధక, డ్వామా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, ఉప కలెక్టర్‌ రాహుల్‌మీనా, కేంద్ర బృందం సభ్యులు మన్ను జి.ఉపాధ్యాయ్, ఎస్‌సీ కష్యప్, మదన్‌ మోహన్‌ మౌర్య, బి.అనురాధ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని