logo

నామినేటెడ్‌ పదవికి రాజీనామా

ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌ రాచగొర్ల వెంకట సుశీల తన పదవికి గురువారం రాజీనామా చేశారు.

Published : 21 Jun 2024 03:17 IST

సుశీల పంపిన రాజీనామా లేఖ చూపుతున్న గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి  

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌ రాచగొర్ల వెంకట సుశీల తన పదవికి గురువారం రాజీనామా చేశారు. ఈ మేరకు సదరు పత్రాన్ని ఆమోదించినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి తెలిపారు. త్రిపురాంతకం మండలానికి చెందిన సుశీల వైకాపా ప్రభుత్వ హయాంలో ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోరంగా ఓడి తెదేపా కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో ఆమె ఆ పదవి నుంచి తప్పుకొన్నారు. కొత్త ఛైర్మన్‌ త్వరలోనే నియమితులు కానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని