logo

నారసింహా.. నమో నమః

దక్షిణ సింహాచలంగా వినుతికెక్కిన మండలంలోని పాత సింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి.

Published : 21 Jun 2024 03:23 IST

గ్రామ వీధుల్లో సాగుతున్న నరసింహ స్వామి ఊరేగింపు 

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: దక్షిణ సింహాచలంగా వినుతికెక్కిన మండలంలోని పాత సింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అయిదో రోజైన గురువారం ఉదయం అర్చకులు స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకాలు చేశారు. వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం చొప్పర సేవలో భాగంగా పల్లకిలో కొలువుదీర్చి గ్రామ వీధుల్లో ఊరేగించారు. రాత్రి 10 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత నరసింహ స్వామిని హనుమంత వాహనంపై ఉంచి పురవీధుల్లో ఉత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని