logo

అక్షర హాలికునికి అశ్రుతాంజలి

‘ఈనాడు’ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభ ఒంగోలు నగరం పేర్నమిట్ట సమీపంలోని యూనిట్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించారు.

Published : 21 Jun 2024 03:29 IST

‘ఈనాడు’ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభ ఒంగోలు నగరం పేర్నమిట్ట సమీపంలోని యూనిట్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ‘ఈనాడు- ఈటీవీ’ ఉద్యోగులు, సిబ్బంది హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. తొలుత యూనిట్‌ ఇన్‌ఛార్జి ఎం.ఎ.ఖాన్‌ ఆధ్వర్యంలో కొద్దిసేపు మౌనం పాటించి సంతాపాన్ని తెలిపారు. రామోజీ చిత్రపటం వద్ద పూలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పలువురు ఉద్యోగులు, సిబ్బంది అక్షర యోధునితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆయన అందించిన అమూల్యమైన సలహాలు, సూచనలను నెమరు వేసుకున్నారు. అక్షరాన్నే వజ్రాయుధంగా చేసుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు సాగించిన పోరును, సామాన్యుడు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించగల శక్తినిచ్చిన మహానుభావుడి మహాభినిష్క్రమణాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అధినేత ఆశయాలను నెరవెర్చేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని ప్రతినబూనారు. 

నివాళి సూచికగా రామోజీ చిత్రపటం వద్ద మౌనం పాటిస్తున్న ‘ఈనాడు- ఈటీవీ’ సంస్థల ఉద్యోగులు, సిబ్బంది, యూనిట్‌ ఇన్‌ఛార్జి ఎం.ఎ.ఖాన్‌ 

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని